హైదరాబాద్: 57 ఎస్సీ ఉపకులాలను ‘ఏ’ కేటగిరీలో చేర్చాలని కోరుతూ ఈ నెల 12న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎస్సీ వెంకటేశం తెలిపారు.
దశాబ్దాలుగా ఎస్సీ ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణే పరిష్కారమని చెప్పారు. ఎస్సీ ఉపకులానికి న్యాయమైన వాటా రావాలంటే ప్రత్యేక కమిటీ వేసి ఉపకులాల స్థితిగతులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.