జనవరి 31న ఎల్బీ స్టేడియంలో త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త పోస్టులు భర్తీ చేస్తామని వేలాది మంది సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. కానీ ఇప్పుడు ఇది అంత ఉత్తిత్తిదేనని తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ మరోసారి 15వేల కొత్త పోలీసుల ఉద్యోగాల గురించి ప్రకటించారు. దీంతో 46జీవోతో అన్యాయానికి గురైన కానిస్టేబుల్ అభ్యర్థులు ..గత నోటిఫికేషన్ లో చివరి వరకూ అర్హత సాధించలేని నిరుద్యోగులు ఆశలు పెంచుకున్నారు.
అయితే తమ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ..సీఎం బుధవారం చేసిన ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసిందని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. గత నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 13,444మందికి ఈమధ్యే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తూ త్వరలో మరో రెండున్నర వేల మందికి నియామక పత్రాలు అందించడం ద్వారా 15వేల పోలీసు ఉద్యోగాలు పూర్తవుతాయని సీఎం ప్రకటించడంతో నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ …2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటున్నారు కానీ..కొత్త నోటిఫికేషన్ వేస్తాననిమాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నియామక పత్రాల సభల్లో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని నిరుద్యోగులను కోరుతున్న సీఎం..కొత్త నోటిఫికేషన్ల సంగతి మాత్రం చెప్పడంలేదని నిరుద్యోగులు నిరుత్సాహపడుతున్నారు.
ఇది కూడా చదవండి: నేడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ పుట్టినరోజు.. ఘనంగా సంబురాలు!!
