ఫిఫా (FIFA 2026) ప్రపంచ కప్ చివరి మ్యాచ్ న్యూయార్క్/న్యూజెర్సీ, USAలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో 82,500 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో జూన్ 11న ప్రపంచకప్ తొలి మ్యాచ్ జరగనుంది.కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో తెలిపారు. 16 అత్యాధునిక స్టేడియాల్లో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూలై 4, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఫిలడెల్ఫియాలో రౌండ్-ఆఫ్-16 గేమ్‌లు జరుగుతాయని తెలిపారు.
అట్లాంటా, డల్లాస్ సెమీఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా, మూడో స్థానానికి సంబంధించిన గేమ్ మయామిలో జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు లాస్ ఏంజెల్స్, కాన్సాస్ సిటీ, మియామి, బోస్టన్లలో జరుగుతాయి. అంతకుముందు 1994లో అమెరికాలో ఫిఫా ప్రపంచకప్‌ను నిర్వహించారు. లాస్ ఏంజెల్స్ సమీపంలోని పసాదేనాలోని రోజ్ బౌల్లో ఫైనల్స్ జరిగాయి.
టోర్నమెంట్ కు ఆతిథ్య మిస్తున్న 16నగరాలు ఇవే:
1. అట్లాంటా
2. బోస్టన్
3. డల్లాస్
4. గ్వాడలజార
5. హౌస్టన్
6. కాన్సాస్ నగరం
7. లాస్ ఏంజెల్స్
8. మెక్సికో నగరం
9. మయామి
10. మాంటెరీ
11. న్యూయార్క్-న్యూజెర్సీ
12. ఫిలడెల్ఫియా
13. శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతం
14. సీటెల్
15. టొరంటో
16. వెంకువారు
ఇది కూడా చదవండి: ఆకలి బాధ తట్టుకోలేక పిల్లి పచ్చిమాంసం తిన్న విద్యార్థి..!
