హైదరాబాద్: జలమండలి పరిధిలోని వివిధ విభాగాల్లో 182 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. 179 మంది జనరల్ పర్పస్ ఉద్యోగులు (GPE) వారి విద్యా అర్హతల ఆధారంగా స్పెషల్ పర్పస్ ఎంప్లాయీస్ (SPE)గా మరియు ముగ్గురు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు (JTO) అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లుగా (ATO) పదోన్నతి పొందారు.
శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌తో కలిసి ఎండీ దానకిషోర్ పాల్గొన్నారు. వీరికి నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.
