ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రముఖ డిపార్ట్ మెంట్ స్టోర్ చైన్ మాకీస్ ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఐదు స్టోర్లను మూసివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2350 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
మాకీస్ మొత్తం ఉద్యోగుల్లో 3.5 శాతం మందిని తొలగిస్తోందని ఈ రిపోర్ట్ తెలిపింది. తొలగించనున్న ఉద్యోగులకు కంపెనీ అంత్గత మెమోను పంపినట్టు కూడా వాల్‌స్ట్రీట్ కథనం. 13 శాతం కార్పొరేట్ సిబ్బందిని తొలగించి ఆదా అయ్యే మొత్తాన్ని కస్టమర్ షాపింగ్ అనుభూతిని మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం.
సప్లైయ్ చైన్ ఆటోమేషన్తో పాటు కొన్ని ఉద్యోగాలను అవుట్ సోర్స్ చేయాలని మాకీస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే విభాగాలకు చెందిన ఉద్యోగులను తొలగిస్తున్నదనే వివరాలను మాకీస్ తెలపలేదు.
ఇది కూడా చదవండి: అద్దంకిని అడ్డుకుంది ఆ ఇద్దరే.. ఎట్టకేలకు బయటపడ్డ నిజం..!
