భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 24న ఉదయం 11:56 గంటలకు పీఎస్ఎల్వీ సీ-54ను ప్రయోగించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఓషన్‌శాట్-3తో సహా ఎనిమిది నానో ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-54 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో తన భూ పరిశీలన ఉపగ్రహాల శ్రేణిలో ఓషన్‌శాట్-1, ఓషన్‌శాట్-2 ఉపగ్రహాలను ప్రయోగించింది.
మహాసముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి మరియు తుఫానులను అంచనా వేయడానికి ఓషన్‌శాట్ కుటుంబం ఉపగ్రహాలను ఉపయోగిస్తారు. ఈ సిరీస్‌లోని తదుపరి ఉపగ్రహం ఓషన్‌శాట్-3ఏను వచ్చే ఏడాది నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో తెలిపింది.