ఉస్మానియా యూనివర్సిటీ(OU)లోని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో లో ఈ నెల 31న (బుధవారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి. రాము తెలిపారు. సియారా గ్రూప్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టెలీకాలర్స్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. 18 ఏళ్లు నిండిన స్త్రీ, పురుషులు ఎవరైనా మేళాకు హాజరుకావచ్చన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 9885030364 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: భువనగిరి జడ్పీచైర్మన్పై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. మండిపడ్డ హరీష్ రావు
