హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలైన ‘హనుమాన్’ 100 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read.. దారుణం. అబ్దుల్లాపూర్‌మెట్‌లో భార్య తల నరికిన భర్త
సినిమా విషయానికొస్తే.. కథ నేపథ్యంలో హనుమంతుడిని చూపించిన విధానం ఆకట్టుకుంది. సినిమా దర్శకుడు పిల్లల నుంచి పెద్దలవరకూ వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథలోని సహజత్వం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ, వీఎఫ్ ఎక్స్, నేపథ్య సంగీతం ఈ సినిమాను పెద్ద సినిమాల స్థాయిలో నిలబెట్టాయని సినీ పండితులు చెప్పారు.
