
మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కేజీల టమోటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. శిరూరు తహసీల్‌కు చెందిన పింపార్ఖేడ్ రైతు అరుణ్ ధోమ్కు చెందిన టమాటాను తీసుకెళ్లారు. దీంతో పుణె పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ రైతు ఆదివారం రాత్రి తన ఇంటి బయట పార్క్ చేసిన కారులో 20 టమాటా డబ్బాలను వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి టమాటా పెట్టెలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా పంట చోరీకి గురైనట్లు గుర్తించారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు షిరూర్ పోలీసులు తెలిపారు.
పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
