నెదర్లాండ్స్‌కు చెందిన వైద్య పరికరాల కంపెనీ ఫిలిప్స్ ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాకబ్స్ ఈరోజు (సోమవారం) మాట్లాడుతూ ఇది చాలా కష్టమైన సమయమని… అయితే 2025 నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించక తప్పదని అన్నారు.
ఫిలిప్స్ చేసిన స్లీప్ రెస్పిరేటర్ల గురించి ఫిర్యాదులు భారీ రీకాల్‌కు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల కిందటే, ఫిలిప్స్ 4,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
గత ఏడాది నాలుగో త్రైమాసికంలో ఫిలిప్స్ దాదాపు 105 మిలియన్ యూరోల నష్టాన్ని ప్రకటించింది. గత సంవత్సరం మొత్తం నష్టం సుమారు 1.605 బిలియన్ యూరోలు. రెస్పిరేటర్ రీకాల్స్ వల్ల ఎక్కువ నష్టం జరిగింది.