చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా 12th ఫెయిల్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఈ చిత్రం 27 అక్టోబర్ 2023న విడుదలైంది. విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అంతే కాకుండా ఈ చిత్రం ద్వారా మేధా శంకర్ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా 69వ ‘ఫిలిం ఫేర్’ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఏకంగా ఈ సినిమా 69వ ఫిలిం ఫేర్‌లో 5 అవార్డులు సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: పీవీకి కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించడం సంతోషకరం
