రైలులో సీటు కోసం గొడవపడుతుండగా ఒకరిని మరో ఇద్దరు వ్యక్తులు రైలు నుంచి తోసేశారు. అనంతపురం-పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో రమేష్ అనే వ్యక్తి మరో ఇద్దరితో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు ప్రయాణికులు రమేష్‌ను రైలు నుంచి తోసేశారు. ఈ ఘటనలో రమేష్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన రమేష్‌ను అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కుమ్మవారి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
The post రైలులో సీటు కోసం గొడవ.. ప్రజలను బయటకు నెట్టిన దుండగులు appeared first on T News Telugu.
