
అంతరిక్ష చరిత్రలో మళ్లీ భారత జెండా రెపరెపలాడుతోంది. ఇస్రో చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించింది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు ఎంఎల్‌వి-3 ఎం4 రాకెట్‌ని నింగిలోకి పంపి మిషన్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ మూడు దశల ప్రయోగంలో చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం 40 రోజుల పాటు ప్రయాణించి చంద్ర ప్రాంతాన్ని చేరుకోనుంది. ఈ ఉపగ్రహంలోని రోవర్ ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై కాలు మోపనుంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
