న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ ఇవాళ వీడ్కోలు పలుకనున్నారు. ఆయన నవంబర్ 8వ తేదీ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. అయితే గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం కోర్టు సెలవు కావడంతో జడ్జి వైయు లలిత్ చివరి పనిదినం సోమవారమే అవుతుంది. ఈమేరకు సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తి నేడు వీడ్కోలు పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తుది తీర్పును ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. YouTube ఛానెల్ మరియు సుప్రీం కోర్ట్ వెబ్కాస్ట్లో లైవ్ టీవీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
న్యాయమూర్తి వైయు లలిత్ ఆగస్టులో దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. 74 రోజుల పాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సీజేఐకి ఇవాళ సుప్రీంకోర్టు గుడ్ బై చెప్పనుంది. కాగా, ఈ నెల 9న సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అతను నవంబర్ 10, 2024 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
829036