Geethanjali Malli Vachindi | టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది.

Geethanjali Malli Vachindi | టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కథనాయకుడిగా నటిస్తుండగా.. సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజలి 50వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తుండగా.. శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొత్త సంవత్సరం కానుకగా మూవీ నుంచి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు హీరో సునీల్ ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఈనెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే స్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇండియన్ ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా స్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో శ్మశాన వాటికలో టీజర్ లాంఛ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻
Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial pic.twitter.com/RhqvoifKB4
— BA Raju’s Team (@baraju_SuperHit) February 22, 2024
ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.