IPL 2024 KKR vs DC : భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐపీఎల్లో రికార్డు ధర పలికిన స్టార్క్ నిప్పులు చెరుగుతుండడంతో నాలుగు వికెట్లు కోల్పోయింది. డేంజరస్ మిచెల్ మార్ష్(0), డేవిడ్ వార్నర్(18)లను..
IPL 2024 KKR vs DC : భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐపీఎల్లో రికార్డు ధర పలికిన స్టార్క్ నిప్పులు చెరుగుతుండడంతో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చిన స్టార్క్..డేంజరస్ మిచెల్ మార్ష్(0), డేవిడ్ వార్నర్(18)లను ఔట్ చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ రిషభ్ పంత్(7), స్టబ్స్(10)లు ఆడుతున్నారు. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 51/4.
స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన వార్నర్ ఆ తర్వాత బంతిని వికెట్ల మీదికి ఆడుకున్నాడు. దాంతో, 33 పరుగులకే ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. అంతకుముందు వరుణ్ చక్రవర్తి వివాదస్పద క్యాచ్‌తో పృథ్వీ షా(10) పెవిలియన్ చేరాడు.
An excellent diving catch by Varun Chakaravarthy 👌
Early trouble for #DC in the chase
They have lost 4 wickets now
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvKKR | @KKRiders pic.twitter.com/SzzvnzRm3F
— IndianPremierLeague (@IPL) April 3, 2024