జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)లో శుక్రవారం అర్థరాత్రి మరోసారి గందరగోళం నెలకొంది. ఎన్నికలకు ముందు యూనివర్శిటీ జనరల్ బాడీ మీటింగ్ (యూజీబీఎం)లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష సంస్థ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఏబీవీపీ, లెఫ్ట్ పార్టీలకు చెందిన విద్యార్థులు పొట్టుపొట్టు కొట్టుకున్నారు.దీంతో చాలా మంది విద్యార్థులుకు గాయాలయ్యాయి. కౌన్సెలర్ అనఘా ప్రదీప్ వర్సిటీ జనరల్ బాడీ సమావేశాన్ని కొనసాగించడానికి ఎబివిపి కార్యకర్తలు అనుమతించడం లేదని ఆరోపించారు.ఎన్నికలకు ముందు జనరల్ బాడీ సమావేశాన్ని పిలవడానికి ప్రోటోకాల్‌పై వివాదం కారణంగా ఈ వివాదం ఏర్పడింది.
2019 తర్వాత జేఎన్‌యూలో ఎన్నికలు జరుగుతున్నాయి. JNUSU విద్యార్థుల కోసం అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. 1200 మంది సంతకాలు సేకరించిన తర్వాత యూనివర్సిటీ జనరల్ బాడీ మీటింగ్ (UGBM)ని పిలిచారు. ఈ గొడవలో పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.సరైన విధానాలు పాటించలేదని, వామపక్ష, NSUI విద్యార్థులు ఈ నిబంధనలను పట్టించుకోలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆరోపిస్తోంది.ఘర్షణ సమయంలో, విద్యార్థులు టాంబురైన్లను ఆయుధాలుగా ఉపయోగించారని దీంతో తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: శ్రీశైలం మహాప్రసాదంలో ఎముక ముక్క..!!
