
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రేపు PSLV-C55ని ప్రయోగించనుంది. పిఎస్‌ఎల్‌వి-సి 55 రాకెట్ శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరుతుంది. ఈ ప్రయోగంతో సింగపూర్‌కు చెందిన టెల్ ఎవోస్-2 (741 కిలోలు) ఉపగ్రహాన్ని, 16 కిలోల బరువున్న లుమోలైట్ అనే చిన్న ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం ఉదయం 11:49 గంటలకు ప్రారంభమైంది.
