Cinema Lovers Day | భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఆఫర్‌తో పీవీఆర్ ముందుకు వచ్చింది.
Cinema Lovers Day | భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఆఫర్‌తో పీవీఆర్ ముందుకు వచ్చింది.
ఫిబ్రవరి 23న `సినిమా లవర్స్ డే`ని పురస్కరించుకుని కేవలం రూ.99కే టికెట్‌తో సినిమాని వీక్షించే అవకాశం కల్పించనుంది. పీవీఆర్ మల్టీఫ్లెక్స్ స్క్రీన్లలో ఏ సినిమాకైనా ఇది వర్తిస్తుందని తెలియజేసింది. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఇక తెలంగాణలో మాత్రం పీవీఆర్ ఐనాక్స్ లో రూ.112లకు టికెట్‌ని విక్రయించనున్నట్టు స్పష్టం చేసింది. గత రెండేళ్లలో నేషనల్ సినిమా డే అంటూ రెండు సార్లు మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థలు ఇలాంటి ఆఫర్‌ను తీసుకొచ్చాయి. కాకపోతే అ ఆఫర్ అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో వర్తించింది. అయితే మళ్లీ ఇప్పుడు అదే రేటుకు PVR, INOX మల్టీప్లెక్స్‌లు సినిమా లవర్స్ డే అంటూ ఈ శుక్రవారం ఆఫర్ తీసుకరాబోతున్నారు.
Cinema lovers, get ready! Here is your chance to enjoy the latest blockbusters at an irresistible price of ₹99. 📷📷
Celebrate this Cinema Lovers Day like a true cinephile!
*𝐄𝐱𝐜𝐥𝐮𝐝𝐢𝐧𝐠 𝐫𝐞𝐜𝐥𝐢𝐧𝐞𝐫𝐬 𝐚𝐧𝐝 𝐩𝐫𝐞𝐦𝐢𝐮𝐦 𝐟𝐨𝐫𝐦𝐚𝐭𝐬. *𝐎𝐟𝐟𝐞𝐫… pic.twitter.com/4RkvDbnaIw— P V R C i n e m a s (@_PVRCinemas) February 21, 2024
#CinemaLoversDay #PVRINOX pic.twitter.com/q9utbZhea3
— Aakashavaani (@TheAakashavaani) February 21, 2024
టాలీవుడ్లో ప్రస్తుతం ఈగల్తో పాటు, ఊరుపేరు భైరవకోన సినిమాలు పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్నాయి. ఇవే కాకుండా రేపు సుందరం మాస్టారు, సిద్దార్థ్ రాయ్ లాంటి సినిమాలతో పాటు మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా నీలో, సైరన్, ఆర్టికల్ 370, మమ్ముట్టి `భ్రమయుగం` వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలను మల్టీప్లెక్స్ థియేటర్లలో తెలంగాణలో రూ.112 కే చూడొచ్చు.