చెన్నైలో వర్షం | తమిళనాడులో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువ పొంగి పొర్లుతోంది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా 14 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
చెన్నై, తిరువలూరు, కాంచీపురం, చెంగారపట్టు, రాణిపేట, వేలూరు, సేలం నగరపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఇదే తొలి వర్షం అని అధికారులు తెలిపారు. మరోవైపు పొన్నేరి, ఆవడి మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు అల్లాడిపోయారు. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల పొలాలు నీటమునిగాయి. రోడ్డుపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడు, పాండిచ్చేరిలో భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపలు పట్టకూడదు.
834492