
చెన్నైలో వర్షం | ఈశాన్య రుతుపవనాల రాకతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి చెన్నై నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాతావరణ శాఖ ప్రకారం, గత 72 ఏళ్లలో చెన్నై నగరంలో ఇంత భారీ వర్షాలు కురువడం ఇది మూడోసారి. చెన్నై నగరంలో కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. ఇద్దరు విద్యుదాఘాతానికి గురికాగా, ఇంటి పైకప్పు కూలిపోయి ఒక మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షంతో కాంచీపురం, తిరువలూరులో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు చెన్నై, కాంచీపురం, చంగల్పట్టు, తిరువళ్లూరు, తంజావూరు, తిరువారూరు, నాగపట్నంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. శ్రీలంక ఉత్తర తీరం వెంబడి బంగాళాఖాతంలోని నైరుతి గల్ఫ్‌లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పాండిచ్చేరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
821428