Megastar Chiranjeevi |మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవిపై గుంటూరులో నమోదైన కేసు కొట్టివేసింది.

Megastar Chiranjeevi |మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవిపై గుంటూరులో నమోదైన కేసు కొట్టివేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన చిరంజీవి ఎన్నికల సమయంలో సకాలంలో సమావేశాలు పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. అయితే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.