
తిరుపతి: టీటీడీ ఆయుర్వేద ఫార్మాసిటీ ఆయుష్ ధ్రువీకరించిన ఫార్ములేషన్లతో 314 కొత్త మందులను ఉత్పత్తి చేస్తుందని జేఈవో సదా భార్గవి తెలిపారు. శనివారం రాత్రి రూ.5 కోట్లతో ఆయుర్వేద ఫార్మాసిటీ విస్తరణ పనులను ఆమె పరిశీలించారు. ప్రస్తుతం, ఫార్మసీ 30 మందులను ఉత్పత్తి చేస్తోంది. ఆమె వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ ఈలు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు ఉన్నారు.
